Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై కుల దూషణ.. నలుగురు టీడీపీ నేతలపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు!

  • తుళ్లూరు మండలం అనంతవరంలో ఘటన
  • శ్రీదేవి వస్తే వినాయకుడు మైలపడతాడన్న టీడీపీ నేతలు
  • నలుగురిని నిందితులుగా చేర్చిన పోలీసులు

తెలుగుదేశం నాయకులు తనను కులం పేరుతో దూషించారని వైసీపీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను వినాయకుడి మండపంలోకి వస్తే స్వామి మైలపడతారని టీడీపీ నేతలు అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గీయుల ఫిర్యాదుతో తుళ్లూరు మండలం అనంతవరానికి చెందిన నలుగురు నేతలపై పోలీసులు కేసు నమోదుచేశారు.

ఏ1గా కొమ్మినేని శివయ్య, ఏ2గా కొమ్మినేని సాయి, ఏ3గా కొమ్మినేని రామకృష్ణ, ఏ4గా కొమ్మినేని బుజ్జిలపై ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు. మరోవైపు ఈ విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, గుంటూరు జిల్లా ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే శ్రీదేవి, తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు.

Andhra Pradesh
YSRCP
mla
Undavalli sridevi
abuse
Caste
Police
sc st case
  • Loading...

More Telugu News