Andhra Pradesh: ‘పావలా కల్యాణ్’ వివాదం.. హీరోయిన్ నికిషా పటేల్ కు పూనమ్ కౌర్ మద్దతు!

  • నిన్న పవన్ కల్యాణ్ పుట్టినరోజు
  • పావలా కల్యాణ్ అని చెప్పిన నికిషా పటేల్
  • పొరపాటున ట్వీట్ చేసినట్లు వివరణ

ప్రస్తుతం టాలీవుడ్ లో ‘పావలా కల్యాణ్’ ట్వీట్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. నిన్న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ నికిషా పటేల్ ‘హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్’కు బదులుగా ‘పావలా కల్యాణ్’ అంటూ పొరపాటున ట్వీట్ చేయడంతో ఈ రగడ మొదలైంది. దీంతో తాను పొరపాటున ఆ హ్యాష్ ట్యాగ్ జతచేశాననీ, ఇప్పటికైనా పవన్ అభిమానులు ట్రోలింగ్ ఆపాలని నికిషా పటేల్ కోరింది. తాజాగా నికిషా పటేల్ కు మరో నటి పూనమ్ కౌర్ మద్దతుగా నిలిచింది.

ఈరోజు పూనమ్ కౌర్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘నికిషా.. నువ్వు ప్రజలకు జవాబుదారీవి కావు. కాబట్టి వివరణలు ఇవ్వడం మానేయ్. లేదంటే నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటారు. గతంలో నువ్వు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నీ వ్యాఖ్యలను వక్రీకరించిన ఆ చెత్త జర్నలిస్ట్ గుర్తున్నాడు కదా. దానివల్ల నీ కెరీర్ పైనే ప్రభావం పడింది. ప్రశాంతంగా ఎంజాయ్ చేయ్. నువ్వు నిజం కోసమే నిలబడతావ్. ఐ లవ్ యూ. నీకు దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది.

Andhra Pradesh
Telangana
Tollywood
Pawan Kalyan
Jana Sena
pawala kalyan
nikisha patel
poonam kaur
  • Loading...

More Telugu News