Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం క్రైస్తవ మతప్రచారకులకు గౌరవ వేతనం ఇస్తోంది.. మేం దీన్ని ఖండిస్తున్నాం!: కన్నా లక్ష్మీనారాయణ

  • స్వప్రయోజనాలే లక్ష్యంగా జగన్ సర్కారు
  • మతాల ఆధారంగా ప్రజల్ని విభజిస్తున్నారు
  • ప్రభుత్వ నిధుల్ని గౌరవవేతనంగా ఇస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. స్వప్రయోజనాలే లక్ష్యంగా సమాజాన్ని, మతాలను విభజించి లబ్ధి పొందేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కన్నా విమర్శించారు. ఇందుకోసం ప్రజాధనాన్ని వినియోగించి మతప్రచారకులకు గౌరవవేతనం చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వేతనాలను గ్రామ వాలంటీర్ల ద్వారా చెల్లించేందుకు నిర్ణయించడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య, లౌకికదేశమైన భారత్ లో ప్రజాధనాన్ని వినియోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కన్నా.. ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రతిని జతచేశారు.

Andhra Pradesh
BJP
kanna
christians
government funds
opposing
YSRCP
Jagan
Chief Minister
GO
  • Error fetching data: Network response was not ok

More Telugu News