Andhra Pradesh: సినీ నటుడు ఫిష్ వెంకట్ పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా.. ఏపీ సీఎం జగన్ పై దుష్ప్రచారం!

  • పోలీసులను ఆశ్రయించిన నటుడు
  • నకిలీ ట్విట్టర్ ఖాతాపై ఫిర్యాదు
  • ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్న వెంకట్

ప్రముఖ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ ఈరోజు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొందరు వ్యక్తులు తన పేరుతో నకిలీ ట్విట్టర్ అకౌంట్ సృష్టించారని వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు అకౌంట్ సాయంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఇందుకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఫిష్ వెంకట్ ఫిర్యాదును అందజేశారు. వైఎస్ జగన్ అభిమాని అయిన వెంకట్.. ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో సైతం పాల్గొన్నారు. అలాంటి వెంకట్ పేరుపైనే నకిలీ ట్విట్టర్ ఖాతా పుట్టుకురావడం గమనార్హం..

Andhra Pradesh
Telangana
Tollywood
Fish venkat
fake twitter account
Police
cyber crime
complaint
Hyderabad
  • Loading...

More Telugu News