L.B.Sriram: నేను చనిపోయినట్టు నాకు తరచూ కల రావడమే విచిత్రం: హాస్య నటుడు ఎల్బీ శ్రీరామ్

  • మా ఊళ్లో వాళ్లంతా నన్ను 'భద్రాద్రి' అని పిలుస్తారు 
  • కలలో నా చావు నేను చూసుకునేవాడిని 
  • అప్పుడే వెళ్లిపోవడమేంటని అమ్మ బాధపడేదన్న ఎల్బీ 

నటుడిగా .. రచయితగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఎల్బీ శ్రీరామ్, అభిరుచి కలిగిన దర్శక నిర్మాతగాను మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సరదాగా ఒక విషయాన్ని గురించి ప్రస్తావించారు. "చిన్నప్పటి నుంచి నాకు తరచూ ఒక కల వచ్చేది .. నేను చనిపోతే నా స్నేహితులు నా పాడె మోయడమే ఆ కల. నెలకి ఒకసారైనా ఆ కల రావడం చిత్రంగా అనిపించేది.

ఊళ్లో వాళ్లంతా నన్ను 'భద్రాద్రి' అని పిలిచేవారు. నేను చనిపోతే నా స్నేహితులు 'భద్రాద్రి'కి జై అంటూ నా పాడె మోస్తూ మా ఇంటికి తీసుకొచ్చేవారు. నేను చనిపోయిన విషయం మా అమ్మగారికి చెబితే, 'అప్పుడే వెళ్లిపోవడమేంట్రా ఓ నాలుగు రోజులుండి వెళ్లొచ్చుగా' అనేది. పాడె మోసే వాళ్లు తొందర చేస్తున్నారు .. కుదరదమ్మా' అని చెప్పేసి వెళ్లి పాడెపై పడుకునేవాడిని. ఈ విచిత్రమైన కల తరచూ రావడమే నాకు తమాషాగా అనిపించేది" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News