Prakasam Barrage: భారీ వరద... మరోసారి తెరచుకున్న ప్రకాశం బ్యారేజ్ గేట్లు!

  • 10 గేట్ల ఎత్తివేత
  • దిగువకు 7,500 క్యూసెక్కుల నీరు
  • లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు మరోసారి తెరచుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద 30 వేల క్యూసెక్కులను దాటడంతో, బ్యారేజ్ 10 గేట్లను తెరచిన అధికారులు దిగువకు 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశామని, వరద పెరిగే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాలని యంత్రాంగానికి సూచించామని కృష్ణా జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా దాదాపు 20 వేల క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాగా, పులిచింతల క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల కారణంగానే ప్రకాశం బ్యారేజ్ కి వరద పెరిగింది.

Prakasam Barrage
Gates
Flood
Krishna River
  • Loading...

More Telugu News