USA: అమెరికాలో బోటులో అగ్నిప్రమాదం.. 34 మంది ప్రయాణికుల మిస్సింగ్!

  • శాంతా క్లాజ్ దీవి సమీపంలో ఘటన
  • ఐదుగురు సిబ్బందిని కాపాడిన అధికారులు
  • కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

అగ్రరాజ్యం అమెరికాలో ఓ పడవలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కాలిఫోర్నియా రాష్ట్రం తీరంలోని శాంతా క్లాజ్ ద్వీపానికి సమీపంలో ఓ బోటులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, అత్యవసర సేవల విభాగం అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు.

అయినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో బోటు సముద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఐదుగురు సిబ్బందితో పాటు 34 మంది ప్రయాణికులు బోటులో ఉన్నారు.  వీరిలో ఐదుగురు సిబ్బందిని హెలికాప్టర్ల సాయంతో అధికారులు రక్షించారు. కాగా, గల్లంతైన 34 మంది కోసం అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది గాలింపును కొనసాగిస్తున్నారు.

USA
Fire Accident
boat
34 missing
Police
Rescue operation
  • Loading...

More Telugu News