budda: మీరు దొంగ లెక్కల్లోనే కాదు.. మర్డర్ డైరెక్షన్ లో కూడా ఆరితేరిపోయారని అర్థమైంది: విజయసాయిరెడ్డిపై బుద్ధా ఘాటు వ్యాఖ్యలు

  • వివేకా హత్యకు గురైనప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని చెబితే అర్థం చేసుకోలేకపోయాం
  • హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య వెనుక మర్మమేంటి తాతయ్యా?
  • ఇంతకీ బాబాయ్ ను ఎవరు చంపారు?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైయస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని 420 తాతయ్య విజయసాయిరెడ్డి చెబితే అర్థం చేసుకోలేకపోయామని అన్నారు.

 'మీరు దొంగ లెక్కలే కాదు... మర్డర్ డైరెక్షన్ లో కూడా ఆరితేరిపోయారని అర్థమైంది. ఆ హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య వెనుక మర్మమేంటో చెప్తావా తాతయ్యా?' అని ట్వీట్ చేశారు. ఇంతకీ బాబాయ్ ను ఎవరు చంపారు? అని ప్రశ్నించారు. #WhoKilledBabai అనే ట్యాగ్ ను జతచేశారు.

budda
Vijaysai Reddy
YS Viveka
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News