Telangana: చెన్నైలో తెలంగాణ కబడ్డీ ఆటగాళ్ల అరెస్ట్

  • పుదుచ్చేరిలో కబడ్డీ ఆడి తిరిగి వస్తుండగా దాడి
  • టికెట్ విషయంలో గొడవ
  • ఎగ్మూర్ లో దాడి చేసిన బస్ కండక్టర్

తెలంగాణ కబడ్డీ ఆటగాళ్లపై తమిళనాడులో దాడి జరిగింది. పుదుచ్చేరిలో కబడ్డి ఆడి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. వివరాల్లోకి వెళ్తే, అన్నాసలైలో బస్సు ఎక్కిన ఆటగాళ్లు చెన్నైలోని ఎగ్మూర్ లో దిగారు. అయితే, టికెట్ విషయంలో జరిగిన వాదన చివరకు గొడవకు దారి తీసింది. దీంతో, ఎగ్మూర్ లో దిగిన తర్వాత తెలంగాణ ఆటగాళ్లపై బస్ కండక్టర్ దాడి చేశాడు. ఈ ఘటనలో కబడ్డి కోచ్ లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడిని స్థానికులు సెల్ ఫోన్ తో వీడియో తీశారు. కోచ్ ను కండక్టర్ కొడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కబడ్డి ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

Telangana
Kabaddi Players
Arrest
Tamil Nadu
  • Loading...

More Telugu News