Janareddy: బండారు దత్తాత్రేయను కలసిన జానారెడ్డి!

  • హైదరాబాద్ లోని దత్తన్న ఇంటికి జానా
  • అభినందనలు తెలిపేందుకే
  • ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్న బండారు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితుడైన బండారు దత్తాత్రేయను కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి కలిశారు. హైదరాబాద్, రామ్ నగర్ లోని దత్తన్న నివాసానికి వెళ్లిన జానా, దాదాపు 20 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయినట్టు తెలుస్తోంది.

ఇదేమీ రాజకీయ భేటీ కాదని, గవర్నర్ గా నియమితులైనందుకు దత్తాత్రేయకు అభినందనలు తెలిపేందుకే జానారెడ్డి వచ్చారని ఆయన కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీయేనని సమాచారం. కాగా, ఎల్లుండి హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లనున్న దత్తాత్రేయ, ఆ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సిమ్లాలో జరుగుతున్నాయి. దత్తాత్రేయ ఫ్యామిలీ కోసం రాజ్ భవన్ ను ప్రభుత్వ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Janareddy
Bandaru Dattatreya
Meeting
Himachal Pradesh
Simla
  • Loading...

More Telugu News