Nikisha patel: 'పావలా కల్యాణ్' అంటూ ట్యాగ్ చేసి తిట్టించుకుంటున్న 'కొమరం పులి' హీరోయిన్ నికిషా పటేల్!

  • నిన్న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు
  • పొరపాటున నెగటివ్ ట్యాగ్ పెట్టిన నికిషా
  • ట్వీట్ ను డిలీట్ చేసినా వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి 'కొమరం పులి' చిత్రంలో నటించిన హీరోయిన్ నికిషా పటేల్ గుర్తుందా? ఇప్పుడామె పవన్ అభిమానులతో నానా తిట్లూ తిట్టించుకుంటోంది. నిన్న పవన్ పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగగా, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

 ఇదే సమయంలో నికిషా పటేల్, తన ట్విట్టర్ ఖాతాలో విషెస్ పెడుతూ, నెగెటివ్ హ్యాష్ ట్యాగ్‌ ను యాడ్ చేసి విమర్శలు కొని తెచ్చుకుంది. పవన్‌ కల్యాణ్ కెరీర్‌ లో డిజాస్టర్‌ గా నిలిచిన 'కొమరం పులి'లో ఆయనకు జోడిగా నటించిన నికీషా.. 'పావలా కల్యాణ్' అని హ్యాష్ ట్యాగ్ ను జోడించడమే విమర్శలకు కారణమైంది. ఆమె పొరపాటునే ఈ పని చేసినప్పటికీ, అది వైరల్‌ కాగా, నెటిజన్లు విమర్శలకు దిగారు. ఆపై కాసేపటికే, తన వల్ల జరిగిన పొరపాటును గుర్తించిన ఆమె, ట్వీట్‌ ను డిలీట్ చేయగా, అప్పటికే ఇది వైరల్ అయింది.

Nikisha patel
Pawan Kalyan
Komaram Puli
Pawala Kalyan
  • Loading...

More Telugu News