Srinivasula Reddy: వివేకా హత్య కేసు నిందితుడు శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యపై స్పందించిన కుమారుడు!

  • విచారణకు పిలిపించి వేధించారు
  • అవమానాన్ని తట్టుకోలేకే ఆత్మహత్య
  • ఆరోపించిన శ్రీనివాసులరెడ్డి కుమారుడు

సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసుల రెడ్డి ఆత్మహత్యకు పాల్పడగా, ఇప్పుడీ ఘటన మరింత సంచలనమైంది. శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యపై తాజాగా స్పందించిన ఆయన కుమారుడు, పోలీసుల వేధింపుల కారణంగానే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.

రెండు రోజుల క్రితం పోలీసులు తన తండ్రిని విచారణ నిమిత్తం తీసుకెళ్లారని, హత్య కేసుతో ఎటువంటి సంబంధం లేకపోయినా వేధించడంతోనే, అవమానంతో తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు.  వైఎస్‌ ఫ్యామిలీ అంటే తన తండ్రికి ఎంతో అభిమానమని అన్నాడు. కాగా, ఆత్మహత్యాయత్నం చేసే ముందు శ్రీనివాసుల రెడ్డి, సూసైడ్ నోట్ ను రాసిన సంగతి తెలిసిందే. సీఐ రాములు వేధించినట్టు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఉదయం పోస్టుమార్టం అనంతరం శ్రీనివాసుల రెడ్డి మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. 

Srinivasula Reddy
YS Viveka
Sucide
  • Loading...

More Telugu News