Low Preasure: బంగాళాఖాతంలో అల్పపీడనం... రేపటికి వాయుగుండం!

  • అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
  • కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు
  • హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సముద్రంలోని వాయవ్య ప్రాంతంలో ఇది క్రమంగా బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రేపు ఉదయానికి ఇది వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 7.6 కి. మీ ఎత్తులో నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్నారు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News