star maa tv: బిగ్‌బాస్ హౌస్‌లోకి నటి శిల్పా చక్రవర్తి.. 'వైల్డ్‌కార్డ్' ద్వారా రెండో ఎంట్రీ

  • నటి ఈషా రెబ్బ వస్తుందని ప్రచారం
  • అకస్మాత్తుగా హౌస్‌లోకి వచ్చిన శిల్పా చక్రవర్తి
  • హౌస్‌లో ఇది రెండో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ

స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్‌బాస్-3 హౌస్‌లోకి ప్రముఖ యాంకర్, నటి శిల్పా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చింది. వైల్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమె హౌస్‌లోకి అడుగుపెట్టింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా తొలుత హౌస్‌లో అడుగుపెట్టిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఎక్కువ కాలం ఉండలేకపోయింది. నిజానికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా సోమవారం నటి ఈషా రెబ్బా వస్తారని ప్రచారం జరిగినా.. అకస్మాత్తుగా శిల్ప ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, బర్త్‌డే వేడుకల కోసం నాగార్జున విదేశాలకు వెళ్లడంతో ఆయన స్థానంలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ వారం వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆకట్టుకుంది.

star maa tv
big boss
shilpa chakravarthy
Nagarjuna
  • Loading...

More Telugu News