team India: నాలుగో రోజే ముగించిన భారత్.. రెండో టెస్టులోనూ ఘన విజయం!

  • 257 పరుగుల భారీ తేడాతో విజయం
  • మూడేసి వికెట్లు పడగొట్టిన షమీ, జడేజా
  • మూడు సిరీస్‌లలోనూ ఓడిన విండీస్

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కింగ్స్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో జరిగిన చివరిదైన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించి టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 468 పరుగుల లక్ష్య ఛేదనతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన  విండీస్ 210 పరుగులకే కుప్పకూలి 257 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. విండీస్ ఆటగాళ్లలో బ్రూక్స్ (50), బ్లాక్‌వుడ్ (38), కెప్టెన్ జాసన్ హోల్డర్ (39) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు చెరో మూడు వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ రెండు, బుమ్రా ఒక వికెట్ నేల కూల్చాడు.

విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను 3-0తో, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0తో, ఇప్పుడు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న కోహ్లీ సేన విండీస్ పర్యటనను పరిపూర్ణంగా ముగించింది. సెంచరీ వీరుడు హనుమ విహారికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

team India
west Indies
test match
  • Loading...

More Telugu News