Pakistan: పాకిస్థాన్ లో రైల్వే స్టేషన్ కు సిక్కు మత వ్యవస్థాపకుడి పేరు
- నంకానా షాహిబ్ రైల్వే స్టేషన్ కు గురునానక్ పేరు
- నంకానాలోనే జన్మించిన గురునానక్
- ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహించాలని పాక్ నిర్ణయం
పాకిస్థాన్ లో మైనారిటీ వర్గాల ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్ప సంఖ్యాక మతాలకు అక్కడ గౌరవం లభించడం ఎంతో అరుదైన విషయం. ఈ నేపథ్యంలో తాజాగా, పాకిస్థాన్ లో ఓ రైల్వే స్టేషన్ కు సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ పేరు పెట్టాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించుకోవడం విశేషం. నంకానా షాహిబ్ రైల్వే స్టేషన్ కు గురునానక్ పేరు పెడుతున్నామని పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ తెలిపారు.
నంకానా షాహిబ్ పట్టణం పాకిస్థాన్ లో పంజాబ్ ప్రావిన్స్ లో ఉంది. సిక్కుల ఆరాధ్యుడైన గురునానక్ జన్మించింది ఇక్కడే. అందుకే ఇది వారికి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయింది. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో ఇక్కడి రైల్వే స్టేషన్ కు గురునానక్ పేరు పెడుతున్నట్టు పాక్ వర్గాలు తెలిపాయి. అక్టోబరు నెలాఖరుకు ఇక్కడ కొత్త రైల్వే స్టేషన్ పూర్తవుతుందని భావిస్తున్నారు. దీన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభిస్తారు.