YSRCP: టీడీపీ నాయకులు దూషించారంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

  • ఏపీ రాజధాని ప్రాంతంలో మహిళా ఎమ్మెల్యేకి చేదు అనుభవం
  • తమ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొంటే వినాయకుడు మైల పడతాడంటూ స్థానిక నేతల  వ్యాఖ్యలు!
  • అన్యాయంగా దూషించారంటూ ఆవేదన వ్యక్తం చేసిన శాసనసభ్యురాలు

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని అనంతవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక టీడీపీ నేతలకు, వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవికి మధ్య ఘర్షణ నెలకొంది. తుళ్లూరు మండలం అనంతవరం వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాము నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొంటే వినాయకుడు మైల పడతాడని స్థానిక నేతలు అభ్యంతరం చెప్పడంతో అక్కడ వాగ్వివాదం చెలరేగింది. దాంతో ఉండవల్లి శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను అన్యాయంగా దూషించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

YSRCP
Telugudesam
Undavalli Sridevi
  • Loading...

More Telugu News