Andhra Pradesh: గుంటూరులో దారుణం.. చెరువులో మునిగి ఇద్దరు పిల్లల మృతి!

  • తెనాలిలోని ఐతా నగర్ లో ఘటన
  • పొరపాటున చెరువులో పడిపోయిన ఇద్దరు పిల్లలు
  • చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పండుగ వేళ సరదాగా చెరువు గట్టున ఆడుకుంటున్న చిన్నారులు నీటిలో మునిగిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలోని తెనాలి ఐతానగర్ కు చెందిన రాకేశ్(12), పండు(12) అనే స్నేహితులు చెరువు గట్టున ఈరోజు ఆడుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో రాకేశ్ పొరపాటున కాలుజారి చెరువులోకి పడిపోగా, అతడిని కాపాడే క్రమంలో పండు కూడా నీటిలో మునిగిపోయాడు.

దీంతో పిల్లల కేకలు విన్న స్థానికులు పరుగుపరుగున అక్కడికి చేరుకుని ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అక్కడే రాకేశ్, పండు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పండుగ వేళ ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ఐతానగర్ లో విషాదఛాయలు అలముకున్నాయి.

Andhra Pradesh
Guntur District
two boys
dead
Drowned
  • Loading...

More Telugu News