Andhra Pradesh: ఏపీ ఐటీ పాలసీని రూపొందించే బాధ్యతను రెండుసార్లు వైఎస్ నాకు ఇచ్చారు!: ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ

  • నేడు వైఎస్ 10వ వర్థంతి
  • నివాళులు అర్పించిన అధికారిణి
  • వైఎస్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంస

ఏపీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రముఖ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ..  ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి రెండు సార్లు ఐటీ విధానాన్ని రూపొందించేందుకు వైఎస్ తనకు అవకాశమిచ్చారని తెలిపారు. అలాగే సైబరాబాద్, టైర్2 నగరాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల యువతకు ఉద్యోగాలు, మహిళలకు స్టాంప్ డ్యూటీపై 1 శాతం డిస్కౌంట్, ప్రతీ నెల ఒకటో తేదీనే పెన్షన్ల అందజేత వంటి చర్యలు తీసుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఈరోజు వైఎస్ 10వ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Andhra Pradesh
Telangana
RATNA PRABHA
IAS
OFFICER
Death anniversary
ysr
condolenses
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News