INX media case: చిదంబరాన్ని గృహనిర్బంధంలో ఉంచండి: ప్రత్యేక కోర్టుకు విన్నవించిన ఆయన లాయర్‌

  • వయసు పైబడిన వ్యక్తి అని గుర్తించాలి
  • ఆరోగ్యం కూడా అంత బాగాలేదు
  • ఈ పరిస్థితుల్లో జైలుకు పంపవద్దని విజ్ఞప్తి చేస్తున్నా

చిదంబరానికి వయసుమీద పడిందని, పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ పరిస్థితుల్లో ఆయనను జైలుకు పంపకుండా గృహనిర్బంధంలోగాని, సీబీఐ కస్టడీలోగాని ఉంచాలని ఆయన లాయర్‌ కపిల్ సిబాల్ సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానానికి విజ్ఞప్తి చేశారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన చిదంబరానికి కోర్టు విధించిన సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆయన కస్టడీ పొడిగించాలని, ఆయనకు ఎటువంటి రక్షణ కల్పించవద్దని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. ఆయనను వదిలితే తప్పించుకునే అవకాశం ఉందని, విచారణకు సహకరించక పోవచ్చునని విన్నవించింది. దీనిపై చిదంబరం లాయర్‌ తన వాదనను వినిపిస్తూ గృహనిర్బంధానికి విజ్ఞప్తి చేశారు.

INX media case
chidambaram
CBI
kapil sibal
  • Loading...

More Telugu News