New Delhi: ఆరు గజాల స్థలం...నలుగురు నివాసం ఉండేందుకు వీలుగా మూడంతస్తుల భవనం

  • దేశ రాజధాని ఢిల్లీలో ఓ యజమాని ప్రయోగం
  • తక్కువ స్థలంలోనే అన్ని సదుపాయాలు
  • కాకుంటే గదులే కాస్త ఇరుకు

ఢిల్లీ వంటి మహానగరంలో గజం స్థలం అంటే కోట్లు పలుకుతుంది. అలాంటి చోట ఆరు గజాల స్థలం ఉంటే ఏం చేయాలి? చిన్న స్థలం అని ఊరికే వదిలేస్తే ఎలా? అనుకున్నాడో యజమాని. అందుకే నలుగురు  నివాసం ఉండేందుకు వీలుగా అన్ని సదుపాయాలతో మూడంతస్తుల్లో ఇల్లు కట్టించి అద్దెకు ఇచ్చేశాడు. సాధారణ ఇళ్లలా అన్ని వసతులు, మరుగుదొడ్లు, పడకగది, వంట గది, ఇతర సదుపాయాలు ఇందులో ఉన్నాయి. కాకపోతే గదులు కాస్త చిన్నవిగా, ఇరుకుగా ఉంటాయంతే. అయినప్పటికీ ప్రస్తుతం  అద్దె రూపంలో నెలకు రూ.3500 వారు యజమానికి చెల్లిస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News