Andhra Pradesh: వైఎస్ రాజశేఖరరెడ్డి మాస్ లీడర్.. గొప్ప ప్రభావం చూపారు!: టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు ప్రశంసలు

  • నేడు వైఎస్సార్ వర్థంతి
  • నివాళులు అర్పించిన టీడీపీ నేత
  • వైఎస్ లక్షలాది మంది జీవితాలపై ప్రభావం చూపారని కితాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మాస్ లీడర్ అని టీడీపీ లోక్ సభ సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. వైఎస్ తన పాలనతో లక్షలాది మంది ఆంధ్రులపై, దక్షిణ భారతీయులపై ప్రభావం చూపారని కితాబిచ్చారు.

 వైఎస్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ తన పాలన, విధానాలు, పద్ధతుల ద్వారా సంక్లిష్టమైన  వారసత్వాన్ని విడిచిపెట్టి వెళ్లారని వ్యాఖ్యానించారు. వైఎస్ 10వ వర్థంతి సందర్భంగా రామ్మోహన్ నాయుడు ఈరోజు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ మేరకు తెలుగుదేశం నేత ట్విట్టర్ లో స్పందించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News