Hyderabad: నిండుకుండలా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌

  • ఇటీవల వర్షాలకు పోటెత్తుతున్న వరద
  • గేట్లు ఎత్తేందుకు సిద్ధపడుతున్న అధికారులు
  • పరిసర ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌ సాగర్‌ జలాశయం ప్రస్తుతం నిండుకుండలా దర్శనమిస్తోంది. ఇటీవల కొన్ని రోజుల నుంచి నగర పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చి చేరుతున్న వరదతో హుస్సేన్‌ సాగర్‌ జల కళను సంతరించుకుంది. ఈరోజు ఉదయానికి సాగర్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయికి దగ్గర కావడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తి వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పరీవాహక ప్రజలకు విషయం తెలియజేసి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇప్పటికీ హుస్సేన్‌ సాగర్‌కు వరద పోటెత్తుతుండడంతో అధికారులు సదా అప్రమత్తంగా ఉంటూ నీటి పరిమాణాన్ని గమనిస్తున్నారు.

Hyderabad
hussensaagar
full tank
  • Loading...

More Telugu News