Andhra Pradesh: రాజకీయాల్లోకి తెచ్చిన అయ్యన్నకే గంటా సున్నం పెట్టారు!: నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి అవంతి

  • గంటాను నేను అసలు మనిషిగానే గుర్తించను
  • ఏదో అదృష్టం బాగుండి ఎమ్మెల్యేగా గెలిచారు
  • విశాఖలో మీడియాతో ఏపీ టూరిజం మంత్రి

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై నిప్పులు చెరిగారు. తన పదవి కోసం నమ్మినవాళ్లను ముంచిన చరిత్ర గంటా శ్రీనివాసరావుదని అవంతి విమర్శించారు. తాను నోరు తెరిస్తే గంటా బండారం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. ఈరోజు విశాఖపట్నంలో అవంతి మీడియాతో మాట్లాడుతూ..‘ గంటా శ్రీనివాసరావును నేను కనీసం మనిషిగా కూడా గుర్తించను. అన్నం పెట్టినవారికి గంటా సున్నం పెడతారు. తనను రాజకీయాల్లోకి తెచ్చిన అయ్యన్నకే గంటా శ్రీనివాసరావు సున్నం పెట్టారు.

ఆయన ఇంకా మంత్రిగానే ఉన్నట్లు భ్రమపడుతున్నారు. గంటా నాకు సున్నం పూయాలని చూశారు. నేను పూయించుకోలేదు. ఏదో అదృష్టం బాగుండి గంటా స్వల్ప మెజారిటీతో ఈ ఎన్నికల్లో గెలిచారు. వైసీపీ మంచివాళ్లను మాత్రమే చేర్చుకుంటుంది. కబ్జాదారులను కాదు’ అంటూ అవంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

Andhra Pradesh
YSRCP
avanti
Telugudesam
Ganta Srinivasa Rao
Ayyanna Patrudu
  • Loading...

More Telugu News