West Indies: భారత్-విండీస్ మ్యాచ్‌ను 50 మంది కూడా చూడడం లేదు.. షాక్‌కు గురైన ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా

  • విండీస్ నిండా వలస భారతీయులే
  • అయినా ఆదరణ కరవు
  • ఇలాగైతే విండీస్‌లో క్రికెట్ చచ్చిపోతుంది

కరీబియన్ దీవుల్లో జరుగుతున్న భారత్-విండీస్ టెస్టు మ్యాచ్‌లపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లను స్టేడియంలో పట్టుమని 50 మంది కూడా చూడడం లేదని, చూస్తుంటే కరీబియన్ దీవుల్లో క్రికెట్ చివరి దశకు చేరుకున్నట్టు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విండీస్‌ మొత్తం వలస వచ్చిన భారతీయులతో నిండి పోయిందని, అయినప్పటికీ మ్యాచ్‌లను ఎవరూ చూడకపోవడం, పట్టించుకోకపోవడం తనను షాక్‌కు గురిచేస్తోందని అన్నారు. ఈ విషయంలో ఐసీసీ ఏమైనా చేయాలని, వెస్టిండీస్‌లో క్రికెట్ పూర్వవైభవానికి కృషి చేయాలని రాజీవ్ శుక్లా కోరారు.

West Indies
India
test match
  • Loading...

More Telugu News