Pawan Kalyan: పర్యావరణానికి హాని చేయకుండా పండుగ జరుపుకోవాలి: పవన్ కల్యాణ్

  • ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని
  • హిందువుల తొలి పండుగ అని పేర్కొన్న పవన్
  • అందరూ మట్టి విగ్రహాలనే వినియోగించాలని పిలుపు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది హిందువుల తొలి పండుగ అని, తలచిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని ప్రార్థించే వేడుక అని తెలిపారు. పర్యావరణానికి హాని చేయకుండా పండుగ జరుపుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. నివాసాల్లోనూ, మంటపాల్లోనూ మట్టి విగ్రహాలనే వినియోగించాలని సూచించారు. గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. వినాయకుడ్ని పూజించే ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసైనికుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Pawan Kalyan
Jana Sena
Vinayaka Chavithi
  • Loading...

More Telugu News