Crime News: భార్య ఉండగా మరో యువతితో సహజీవనం : అవసరం తీరాక ముఖం చాటేసిన కౌన్సిలర్‌

  • కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న వైనం
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
  • సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఘటన

మూడు ముళ్లువేసి, ఏడడుగులు నడిచి పెళ్లి చేసుకున్న భార్య ఉండగా, ఆమెకు తెలియకుండా మరో మహిళతో కొన్నాళ్లుగా సహజీవనం చేయడమేకాక మోజు తీరాక ముఖం చాటేస్తుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి.

పశ్చిమబెంగాల్‌కు చెందిన మితా బిశ్వాస్‌ కుటుంబంతో కలిసి పదకొండేళ్ల క్రితం సదాశివపేట వలస వచ్చింది. పట్టణంలోనే తండ్రి ధృవ బిశ్వాస్‌ నిర్వహిస్తున్న క్లినిక్‌ బాధ్యతలు చూసుకుంటోంది. ఈప్రాంతం మున్సిపాలిటీలోని ఒకటో వార్డు పరిధిలోకి వస్తుంది. దీని ప్రస్తుత కౌన్సిలర్‌ అరుణ్‌కుమార్‌కు మితా బిశ్వాస్‌తో పరిచయం అయ్యింది. దీంతో ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య అవగాహన కుదరడంతో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దాదాపు 20 లక్షల రూపాయలు మితా నుంచి అరుణ్‌కుమార్‌ తీసుకున్నాడు. ఈనేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని మిత ఒత్తిడి చేయడంతో అరుణ్‌కుమార్‌ తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. తన డబ్బు తీసుకోవడమేకాక, పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ మిత పోలీసులను ఆశ్రయించింది.

Crime News
Ranga Reddy District
sadasivapeta
councilar
Cheating
  • Loading...

More Telugu News