Pawan Kalyan: చంద్రబాబు, పవన్ కల్యాణ్ సేమ్ టూ సేమ్: విజయసాయి రెడ్డి!

  • అమరావతి విషయంలో పూర్తి స్పష్టత
  • ప్రాంత ప్రజల కష్టాలు తీర్చడమే లక్ష్యం
  • పవన్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం పూర్తి స్పష్టతతో వ్యవహరిస్తోందని, అస్పష్టతతో ఉందన్న వార్తలు విపక్షాల సృష్టేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లాకు చెందిన తెలుగుదేశం నేత అడారి ఆనంద్ తదితరులు కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా, అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడారు.

గతంలో చంద్రబాబు యూ-టర్న్ లు తీసుకున్నట్టుగానే ఇప్పుడు పవన్ కల్యాణ్ యూ-టర్న్ లు తీసుకుంటున్నారని ఆరోపించారు. పవన్ ఇప్పుడు రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తున్నాడని అన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రజలు, రైతులకు ఉన్న కష్టనష్టాలను సరిచేయడమే తమ లక్ష్యమని చెప్పారు. గతంలో అమరావతి ప్రాంతం క్యాపిటల్ గా పనికిరాదని చెప్పి నిరసనలు తెలియజేసిన పవన్, నేడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని, ఆయన వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ ఒకేలా మారారని చురకలంటించారు.

Pawan Kalyan
Vijay Sai Reddy
Amaravati
Capital
Chandrababu
  • Loading...

More Telugu News