ESL Narasimhan: నరసింహన్ కు మరో పోస్ట్ ఇవ్వని కేంద్రం... విద్యాసాగర్ రావుకు కూడా!

  • ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ
  • కేంద్ర హోమ్ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశం
  • జమ్ముకశ్మీర్ కు పంపే అవకాశం

నిన్నటి వరకూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ కాగా, ఆ స్థానంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళ సై సౌందరరాజన్ ను నియమిస్తూ ఉత్తర్వలు జారీ అయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన నరసింహన్ కు మరో పోస్ట్ ను కేంద్రం ఇంకా ప్రకటించలేదు. ఆయన వెంటనే కేంద్ర హోమ్ శాఖలో రిపోర్ట్ చేయాలని మాత్రం ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్ లో ఆయనకు కీలక పదవిని అప్పగించవచ్చని సమాచారం.

ఇదే సమయంలో ఇప్పటివరకు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న మాజీ ఎంపీ విద్యాసాగర్ రావుకు సైతం మరే విధమైన బాధ్యతలనూ కేంద్రం అప్పగించలేదు. ఆయన సేవలను మరో రాష్ట్రంలో బీజేపీ తరఫున వాడుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీని మరింతగా బలోపేతం చేసి, 2023 ఎన్నికలు లక్ష్యంగా ఆయనకు బాధ్యతలు అప్పగించ వచ్చని సమాచారం.

ESL Narasimhan
Vidyasagar Rao
Telangana
Governer
  • Loading...

More Telugu News