Ala Vaikunthapuramulo: 'అల వైకుంఠపురములో' ఫస్ట్ లుక్... సూపర్బ్ గా అల్లు అర్జున్!

  • ఫస్ట్ లుక్ విడుదల చేసిన బన్నీ
  • స్టూల్ పై స్టయిల్ గా కూర్చున్న అల్లు అర్జున్
  • వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాల తరువాత హ్యాట్రిక్ విజయం కోసం వారిద్దరి కాంబినేషన్ లో వస్తున్న 'అల వైకుంఠపురములో' చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. కొద్దిసేపటి క్రితం బన్నీ, ఈ సినిమా మొదటి ప్రచార చిత్రాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

ఈ పోస్టర్ లో అటు క్లాస్ గా, ఇటు మాస్ గా కనిపిస్తున్న అల్లు అర్జున్ సూపర్భ్ అనిపిస్తున్నాడు. ఓ హై ఎండ్ కారు ముందు స్టూల్ పై, కోటు వేసుకుని కూర్చున్న అల్లు అర్జున్ కు ఓ పోలీసు సిగరెట్ ను వెలిగిస్తున్నట్టు ఇది కనిపిస్తోంది. బన్నీ 19వ చిత్రంగా రానున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కానుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. టబు, జయరాం, నివేదా పేతురాజ్, సుశాంత్, సునీల్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తుండగా, హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Ala Vaikunthapuramulo
Allu Arjun
First Look
  • Error fetching data: Network response was not ok

More Telugu News