lalu prasad yadav: లాలు ప్రసాద్ యాదవ్ పరిస్థితి విషమం.. కిడ్నీలు పనిచేయడం లేదన్న వైద్యులు

  • వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలు
  • బ్లడ్ ప్లజర్, బ్లడ్ షుగర్‌లో తేడాలు ఉన్నాయన్న వైద్యులు
  • ఆయన ఆరోగ్యం నిలకడగా లేదని స్పష్టీకరణ

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయన కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్లజర్‌లో తేడాలు ఉన్నాయని ఆయనను పరీక్షిస్తున్న సీనియర్ వైద్యుడు డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ ఈ ఉదయం వెల్లడించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా లేదని పేర్కొన్నారు.

దాణా కుంభకోణంలో నిందితుడిగా తేలిన 71 ఏళ్ల లాలు 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ఆయన డైట్‌ను బాగా తగ్గించినట్టు తెలిపారు. ప్రస్తుతం మందులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

lalu prasad yadav
RJD
Bihar
  • Loading...

More Telugu News