Ishant Sharma: టెస్టుల్లో అడుగుపెట్టిన పుష్కర కాలానికి అర్ధ సెంచరీ చేసిన ఇషాంత్ శర్మ

  • అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 12 ఏళ్ల తర్వాత తొలి అర్ధ సెంచరీ
  • ఇప్పటి వరకు అతడి అత్యుత్తమ స్కోరు 31 నాటౌట్
  • 157వ ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ నమోదు

విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ అర్ధ సెంచరీ సాధించాడు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్ 69 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. మొత్తంగా 80 బంతులు ఎదుర్కొన్న ఇషాంత్ 7 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇషాంత్‌‌కు ఇది తొలి అర్ధ సెంచరీ. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో కాలుమోపిన ఇషాంత్ సరిగ్గా 12 ఏళ్ల తర్వాత, 157వ ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించడం గమనార్హం.

ఇప్పటి వరకు ఇషాంత్ శర్మ అత్యధిక స్కోరు 31 (నాటౌట్). 2010లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 106 బంతులు ఆడిన ఇషాంత్ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఇదే అతడి వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు కాగా, ఇప్పుడు అర్ధ సెంచరీ చేసి ఆ రికార్డును తిరగరాశాడు.

Ishant Sharma
test match
half century
wes indies
  • Loading...

More Telugu News