Nara Lokesh: జగన్ గారూ, మీరంటే లక్ష కోట్లకు అధిపతులు... సెలవు వంకతో ఉద్యోగులకు మూడో తేదీ తర్వాత జీతాలు ఇస్తారా?: నారా లోకేశ్

  • సెప్టెంబరు 2న వినాయకచవితి
  • ఆ రోజున సెలవు కావడంతో మూడో తేదీ తర్వాతే జీతాలు అంటూ ప్రచారం
  • ట్విట్టర్ లో స్పందించిన నారా లోకేశ్

ఏపీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబరు 3వ తేదీ తర్వాతే జీతాలు ఇస్తుందన్న ప్రచారం నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. "జగన్ గారూ మీరంటే లక్ష కోట్లకు అధిపతులు. మీకు జీతంతో పనిలేదు. కానీ, ఉద్యోగుల పరిస్థితి వేరు. సెప్టెంబరు 2న వినాయకచవితి ఉందని తెలిసి కూడా సెలవులు సాకుగా చూపి మూడో తేదీ తర్వాత జీతాలు ఇస్తారా? పెన్షనర్ల పరిస్థితి కూడా ఇంతే కదా? వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ప్రజల్ని అప్పు చేసి పండుగ చేసుకోమంటోంది" అంటూ విమర్శలు చేశారు.

సెప్టెంబరు 1న ఆదివారం, ఆ మరుసటి రోజున వినాయకచవితి కావడంతో వరుసగా బ్యాంకులకు రెండ్రోజులు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే, ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు ఖాతాలో పడతాయన్నది అనిశ్చితిగా మారింది.

  • Loading...

More Telugu News