Vijay Sai Reddy: పందికి ఏం తెలుస్తుంది పాండ్స్ వాసన... పార్టీకి ప్రాణమిచ్చే వారిని కుక్కలతో పోల్చాడంటూ విజయసాయిపై బుద్ధా ఫైర్

  • టీడీపీ అధినాయకత్వంపై విజయసాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్
  • ఘాటుగా బదులిచ్చిన బుద్ధా వెంకన్న
  • నీలాంటి అవినీతి పందులకు జైలు పూజ చేయిస్తామంటూ వ్యాఖ్యలు

ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి వర్సెస్ టీడీపీ నేతల వార్ రసవత్తరంగా సాగుతోంది. విజయసాయి ఘాటైన పదజాలంతో ట్వీట్లు చేస్తుండగా టీడీపీ నేతలు అంతకంటే కాస్త మోతాదు పెంచి మరీ బదులిస్తున్నారు. తాజాగా, పెంపుడుకుక్కలన్నింటినీ తండ్రీకొడుకులు గొలుసులు విప్పి వదిలేశారని విజయసాయి చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు.

"అయినా పందికి ఏం తెలుస్తుంది పాండ్స్ వాసన? దొంగలెక్కలు రాసేవాడికి కార్యకర్తలు, నాయకుల విలువ ఎలా తెలుస్తుంది? పార్టీ కోసం ప్రాణాలైనా ఇచ్చేవారిని కుక్కలతో పోల్చి సంబరపడిపోతున్నావు, నీలాంటి అవినీతి పందులకు త్వరలోనే జైలు పూజ చేయిస్తాం. త్వరలోనే నీకు చిప్పకూడు ఖాయం" అంటూ తీవ్ర ఆవేశంతో బుద్ధా ట్వీట్ చేశారు.

"మిమ్మల్ని చూసినా, మీ మాటలు విన్నా పత్తిత్తే గుర్తుకు వస్తుంది. చంద్రబాబు రాజకీయ హింస మొదలుపెడితే ఈ రోజు పిచ్చికూతలు కూయడానికి మీరు ఉండేవారు కాదేమో!" అంటూ ఈటెల్లాంటి మాటలతో బుద్ధా బదులిచ్చారు.

Vijay Sai Reddy
Buddha Venkanna
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News