Manchu Manoj: మళ్లీ రంగంలోకి దిగుతోన్న మంచు హీరో

  • హిట్ కొట్టలేకపోయిన మంచు మనోజ్ 
  • కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ 
  • అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ 

మంచు మనోజ్ హీరోగా ఆ మధ్య కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే హీరోగా ఆయన భారీ హిట్ మాత్రం చూడలేకపోయాడు. దాంతో ఆయన సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇటీవల కాలంలో ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఒకానొక దశలో తను ఇకపై నటించననే స్టేట్మెంట్ కూడా ఇచ్చేసి అభిమానులను కంగారు పెట్టేశాడు.

అలాంటి మంచు మనోజ్, త్వరలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన శ్రీకాంత్, ఇటీవల మంచు మనోజ్ కి మంచి కథను వినిపించాడట. కథలోని కొత్తదనం వలన వెంటనే మనోజ్ అంగీకరించాడని అంటున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని చెబుతున్నారు. ఈ సినిమా కోసం మనోజ్ బరువు తగ్గుతున్నాడని అంటున్నారు. అక్టోబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానున్నట్టుగా చెబుతున్నారు.

Manchu Manoj
  • Loading...

More Telugu News