Sikh Girl: సిక్కు బాలికను బలవంతంగా మతం మార్పించి, పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ వ్యక్తి ఎవరో తెలుసా?

  • పాక్ లోని గురుద్వారా ప్రాంతంలో నివసించే సిక్కు బాలిక కిడ్నాప్
  • మతం మార్చి బలవంతంగా పెళ్లాడిన ముస్లిం వ్యక్తి
  • జమాత్ ఉద్దవా సంస్థతో అతడికి సంబంధాలు ఉన్నట్టు గుర్తింపు

పాకిస్థాన్‌లోని గురుద్వారా ప్రాంతంలో నివసించే సిక్కు బాలిక జగ్జీత్‌ కౌర్‌ను కిడ్నాప్ చేసి, అనంతరం బలవంతంగా మతం మార్చి, ఓ ముస్లిం వ్యక్తి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. 2008 ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ కు చెందిన ఉగ్రసంస్థ జమాత్ ఉద్దవాతో సంబంధం ఉన్న వ్యక్తిగా అతడిని గుర్తించారు. ఇంకా అతడిని అరెస్ట్ చేయాల్సి ఉంది.

ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ స్పందించలేదు. అయితే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... జరిగిన దారుణం ప్రపంచానికంతా తెలిసిపోయింది.

Sikh Girl
Pakistan
Marriage
Hafiz Saeed
Jammat ud Dawah
  • Loading...

More Telugu News