gram sachivalayam: గ్రామ సచివాలయాలకు వైసీపీ జెండా రంగులు.. పంచాయతీ భవనాలు కూడా!
- తమదైన ముద్రకోసం అధికార పార్టీ ఆరాటం
- అక్టోబర్ 2 నుంచి ప్రారంభంకానున్న నూతన వ్యవస్థ
- ఈ రూపులోకే మారనున్న పంచాయతీ భవనాలు
స్థానిక పాలనను ప్రజలకు మరింత చేరువలోకి తెచ్చేందుకు గ్రామ సచివాలయాల పేరుతో నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో తమదైన ముద్రకోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సచివాలయ భవనాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగులైన గ్రీన్, సియాన్, తెలుపు హంగులతో తీర్చిదిద్దుతున్నారు.
అలాగే, పంచాయతీ భవనాలకు కూడా ఇదే విధమైన రంగులతో హంగులు అద్దాలని ఆదేశించారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రానున్నదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అవసరమైన ఆదేశాలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కలెక్టర్‌లకు ఇచ్చారు.