Oscar-winning actor: టెక్సాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరనున్న ఆస్కార్ అవార్డు నటుడు!

  • 1993లో ఫిల్మ్ డిగ్రీ అందుకున్న మాథ్యూ మెక్ కనాగీ
  • 2015 నుంచి ఆస్టిన్ క్యాంపస్‌లో విజిటింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు
  • 50కి పైగా సినిమాల్లో నటించిన మెక్ కాగీ

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు అందుకున్న హాలీవుడ్ నటుడు  మాథ్యూ మెక్ కనాగీ త్వరలో టెక్సాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరనున్నాడు. యూనివర్సిటీలోని రేడియో-టెలివిజన్-ఫిల్మ్ డివిజన్‌లో చేరి విద్యార్థులకు పాఠాలు బోధించనున్నాడు. 2015 నుంచి మాథ్యూ ఆస్టిన్ క్యాంపస్‌లో విజిటింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్నాడు. టీచర్‌గా, మెంటార్‌గా అతడి సేవలను గుర్తించినట్టు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపైనా అతడి పాఠాలు కొనసాగుతాయని పేర్కొంది.

మెక్ కనాగీ 1993లో ఫిల్మ్ డిగ్రీ అందుకున్నాడు. ‘డేజ్‌డ్ అండ్ కన్ఫ్యూజ్‌డ్’ సహా 50కిపైగా చిత్రాల్లో నటించాడు. ‘ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అండ్ డల్లాస్ బయ్యర్స్ క్లబ్’ సినిమాకు గాను ప్రతిష్ఠాత్మక ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నాడు.

Oscar-winning actor
Matthew McConaughey
University of Texas
  • Loading...

More Telugu News