Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు 3నే వేతనాలు: ఆర్థిక శాఖ

  • ఒకటో తేదీ ఆదివారం, సోమవారం వినాయక చవితి సెలవు
  • మూడో తేదీన బ్యాంకుల్లో జమకానున్న వేతనం
  • పింఛన్ లబ్ధిదారులకు మూడో తేదీనే..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే నెల మూడో తేదీ వరకు వేతనాల కోసం ఎదురుచూడక తప్పదు. సంక్షేమ పథకాల పింఛన్లు అందుకుంటున్న వారికి కూడా అదే రోజున డబ్బులు అందనున్నాయి. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ తెలిపింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లను ఒకటో తేదీనే ఆర్థిక శాఖ విడుదల చేస్తుంది. అయితే, ఒకటో తేదీ ఆదివారం, రెండో తేదీ అయిన సోమవారం వినాయక చవితి సెలవు కావడంతో బ్యాంకులకు సెలవు. దీంతో మూడో తేదీన వేతనాలు బ్యాంకులో జమకానున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

  • Loading...

More Telugu News