Vizag: గంటా శ్రీనివాస్ పై మంత్రి అవంతి మండిపాటు

  • విశాఖను ఆర్థిక రాజధాని చేయాలన్న గంటా వ్యాఖ్యలపై స్పందన
  • గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు?
  • నిద్రపోయాడా? అప్పుడు గుర్తుకు రాలేదా విశాఖ?

విశాఖపట్టణాన్ని ఆర్థిక రాజధానిగా చేయాలని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో మంత్రిగా పని చేసిన ఆయన ఐదేళ్లపాటు ఏం చేశారు? నిద్రపోయాడా? అప్పుడు గుర్తుకు రాలేదా విశాఖపట్టణం? అని ప్రశ్నించారు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ‘మీరు చేసే ల్యాండ్ పూలింగ్, భూ కుంభకోణాలు, కబ్జాలను ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. గతంలో ఆయన(గంటా) సహచర మంత్రే ఆయనపై సిట్ వేయాలని చెప్పారని గుర్తుచేశారు. ముందుగా, ఆత్మపరిశీలను చేసుకోవాలని, చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Vizag
Ganta Srinivasa Rao
Minister
Avanthi
  • Loading...

More Telugu News