Narendra Modi: మోదీని విమర్శిస్తూ ప్రసంగిస్తున్న పాక్ రైల్వే మంత్రికి కరెంట్ షాక్!

  • ఇస్లామాబాద్ లో మోదీపై విమర్శలు చేసిన షేక్ రషీద్
  • ఒక్కసారిగా మంత్రికి కరెంట్ షాక్
  • తమాయించుకుని మళ్లీ ప్రసంగం మొదలుపెట్టిన వైనం

పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ కు ఊహించని అనుభవం ఎదురైంది. ఇస్లామాబాద్ లో ఓ ర్యాలీలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలకు తెరలేపారు. కశ్మీర్ విషయంలో మోదీ ఏమనుకుంటున్నారో మాకు తెలుసు అంటూ వ్యాఖ్యానిస్తుండగా ఒక్కసారిగా ఆపాదమస్తకం కంపించిపోయారు. కాళ్ల వద్ద ఉన్న వైర్లు తాకడంతో ఆయన విద్యుదాఘాతానికి గురయ్యారు. ఒక్కసారిగా తత్తరపాటుకు గురై, వెంటనే తమాయించుకున్న పాక్ మంత్రి ఈ సమావేశాన్ని మోదీ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

Narendra Modi
Sheikh Rashid
Pakistan
India
  • Error fetching data: Network response was not ok

More Telugu News