Etala Rajender: భూకంపం పుడుతుందనుకుంటే.. తుస్సుమనిపించాడు: ఈటల వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి

  • ఈటల వ్యాఖ్యలతో భూకంపం పుట్టిందని అనుకున్నాం
  • కేటీఆర్ ఫోన్ చేయగానే తుస్సుమనిపించాడు
  • కరీంనగర్ పౌరుషం అంటే ఇదేనా?

తెలంగాణ మంత్రి పదవి తనకు భిక్ష కాదంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. గులాబీ జెండాకు తామే యజమానులమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు ఫోన్ చేయడంతో... అంతా సైలెంట్ అయిపోయింది.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈటల వ్యాఖ్యలతో భూకంపం పుట్టిందని అందరం అనుకున్నామని... రాత్రి కేటీఆర్ ఫోన్ చేయగానే ఈటల తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ పౌరుషమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో కేటీఆర్ ఇక్కడ లేడని... అమెరికాలో బాత్రూమ్ లు కడుగుతూ బతుకుతున్నారని అన్నారు.

Etala Rajender
KTR
TRS
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News