Chidambaram: ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు సీబీఐ కస్టడీ పొడిగింపు

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన చిదంబరం
  • సెప్టెంబరు 2వరకు సీబీఐ కస్టడీ
  • ఈడీ అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ పొడిగించిన న్యాయస్థానం

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ కస్టడీని సెప్టెంబరు 2 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. గత 9 రోజులుగా సీబీఐ కస్టడీలోనే ఉన్న చిదంబరంకు మరో 4 రోజులు కస్టడీ పొడిగించారు. అయితే ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆయనకు ఊరట లభించింది. దీనిపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం సెప్టెంబరు 5న నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అప్పటివరకు చిదంబరంను ఈడీ అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణను పొడిగించింది.

Chidambaram
CBI
ED
INX
  • Loading...

More Telugu News