Pawan Kalyan: అమరావతిని రాజధానిగా ఉంచుతారా? లేదా?: పవన్ కల్యాణ్

  • రాజధాని విషయంలో క్లారిటీ ఇవ్వండి
  • అమరావతిని పొలిటికల్ గేమ్ గా చూడొద్దు
  • రాజధానిని తరలించేందుకు జనసేన ఒప్పుకోదు

ఏపీ రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈనాటి పర్యటనలో భాగంగా కురగల్లు గ్రామస్తులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు తమను కలవరానికి గురి చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసమే తాము భూములను ఇచ్చామని... ఏ ఒక్క పార్టీకో ఇవ్వలేదని రైతులు తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రాజధాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచుతారా? లేదా? స్పష్టం చేయాలని అన్నారు. రాజధానిని పొలిటికల్ గేమ్ గా చూడొద్దని... రాజధానిని తరలించడానికి జనసేన ఒప్పుకోదని చెప్పారు. రాజధానిపై ప్రకటన చేసేముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలని బొత్సకు సూచించారు. రాజధాని ప్రాంత రైతులకు తాను అండగా ఉంటానని చెప్పారు.

Pawan Kalyan
Janasena
Amaravathi
Farmers
Botsa Satyanarayana
  • Loading...

More Telugu News