East Godavari District: అమలాపురంలో... సెలైన్ లో విషం ఎక్కించుకుని వైద్యుడి కుటుంబం ఆత్మహత్య

  • అమలాపురంలో ఆర్థోపెడిక్ డాక్టర్ గా పేరు 
  • భార్య, కుమారుడితో కలసి వైద్యుడి ఆత్మహత్య
  • రియలెస్టేట్ వ్యాపారంలో నష్టాలే కారణం

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దారుణం సంభవించింది. తన కుటుంబంతో కలసి ఓ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ కృష్ణంరాజుకి ఆర్థోపెడిక్ వైద్యుడిగా మంచి పేరు ఉంది. రియలెస్టేట్ వ్యాపారంలో ఆయన పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, వ్యాపారంలో నష్టాలు రావడంతో భార్య, కుమారుడితో కలసి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సెలైన్ ద్వారా విషం ఎక్కించుకుని వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

East Godavari District
Amalapuram
Doctor Family
Suicide
  • Loading...

More Telugu News