indian currency: 31 శాతానికి పడిపోయిన రూ.2000 నోట్ల చలామణి

  • 2016-17లో 50.2 శాతంగా ఉన్న రూ.2 వేల నోట్ల చలామణి
  • గణనీయంగా తగ్గిన వంద నోటు చలామణి
  • మొత్తం చలామణిలో రెండు శాతంగా ఉన్న రూ.50 నోట్లు

భారతదేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లలో రూ.2000 నోట్ల చలామణి 31.2 శాతానికి పడిపోయింది. 2016-17 మార్చిలో రూ. 2 వేల నోట్ల చలామణి 50.2 శాతంగా ఉండగా ప్రస్తుతం భారీగా తగ్గినట్టు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) డేటా ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువలో రూ.500 నోట్ల చలామణి  51 శాతంగా ఉంది. రెండేళ్ల క్రితం రూ.500 నోట్ల చలామణి 22.5 శాతంగా ఇప్పుడు వాటి చలామణి భారీగా పెరగడం గమనార్హం.

ఇక మొత్తం చలామణిలో ఉన్న నోట్ల విలువలో రూ.200 నోట్ల షేర్ 3.8 శాతంగా ఉంది. వంద రూపాయల నోట్ల షేర్ 2017లో 19.3 శాతంగా ఉండగా, 2018లో 12.3 శాతానికి తగ్గింది. ప్రస్తుతం మరింత తగ్గి 9.5 శాతానికి చేరుకుంది. ఇక, చలామణిలో అన్నింటికంటే తక్కువ షేర్ రూ.50 నోటుదే. 2017లో 2.7 శాతంగా ఉన్న రూ.50 నోట్ల చలామణి 2018లో 2 శాతానికి పడిపోగా ప్రస్తుతం కూడా అంతే ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News