Krishna District: పోలీసు బలంతో జగన్‌ ప్రభుత్వం అకృత్యాలు: మాజీ మంత్రి దేవినేని మండిపాటు

  • తనను గృహనిర్బంధం చేయడంపై మండిపాటు
  • శాంతియుతంగా ధర్నా చేస్తే అరెస్టు చేస్తారా?
  • అందరికీ ఇసుక అందాలన్నదే తమ విధానమన్న దేవినేని

పోలీసు బలంతో ఏపీలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దేవినేని ఉమ మండిపడ్డారు. ఇసుక పాలసీపై పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ధర్నాలో భాగంగా కృష్ణా జిల్లా గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద జరిగే కార్యక్రమానికి వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకుని గృహనిర్బంధం చేశారు. ధర్నాకు ఎటువంటి అనుమతి లేదంటూ పోలీసులు ఆయనకు నోటీసు జారీ చేశారు. దీనిపై ఉమ మండిపడుతూ శాంతియుతంగా ధర్నా చేసే వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది టీడీపీ నాయకులను అరెస్టు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఇసుక పాలసీని తీసుకురావాలన్నదే తమ డిమాండ్‌ అని స్పష్టం చేశారు.

Krishna District
gollapudi
deveneni uma
arrest
  • Loading...

More Telugu News