Amit Shah: అమిత్ షా నిజమైన కర్మయోగి.. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా: ముఖేశ్ అంబానీ ప్రశంసలు

  • గాంధీనగర్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన అమిత్ షా, ముఖేశ్ అంబానీ
  • అమిత్ షాపై అంబానీ ప్రశంసలు
  • మీలాంటి నాయకుడు దొరికినందుకు దేశం గర్విస్తోందని వ్యాఖ్య

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రశంసల్లో ముంచెత్తారు. అమిత్ షా నిజమైన కర్మయోగి అని, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కితాబిచ్చారు. గాంధీనగర్ లోని పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖేశ్ మాట్లాడుతూ, 'అమిత్ భాయ్... మీలాంటి గొప్ప నాయకుడు లభించినందుకు గుజరాత్ తో పాటు యావత్ దేశం ఎంతో గర్వపడుతోంది' అని అన్నారు. ఈ సందర్భంగా వేదికపై అమిత్ షా కూడా ఉన్నారు.

ఇక విద్యార్థులను ఉద్దేశించి, దేశం సురక్షితంగా ఉందా? అనే అంశంపై ముఖేశ్ మాట్లాడుతూ, మీ లక్ష్యాలను ఎప్పుడూ తగ్గించుకోవద్దని, పెద్ద కలలను కనడానికి ఆలోచించవద్దని చెప్పారు. రానున్న రోజుల్లో భారత్ లో ఎన్నో అవకాశాలు వస్తాయని... మీ అందరి కలలు సాకారమవుతాయని అన్నారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు 2014 వరకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని చెప్పారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ను గత ఐదేళ్లలో తాము నిలబెట్టామని తెలిపారు.

Amit Shah
Mukhesh Ambani
Gandhinagar
BJP
Reliance
  • Loading...

More Telugu News