Pawan Kalyan: కాసేపట్లో అమరావతిలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

  • ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న పర్యటన
  • రెండు రోజుల పాటు రాజధానిలో మకాం
  • రైతులు, రైతు కూలీలతో సమావేశాలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతిపై మంత్రి బొత్స ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజధానికి అమరావతి అనువైనది కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించాయి. దీంతో, భయాందోళనలకు గురైన అమరావతి రైతులు పవన్ ను కలసి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, రెండు రోజుల పాటు అమరావతిలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తానని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా నేడు ఆయన అమరావతికి వెళ్లనున్నారు.

ఈ ఉదయం 10 గంటలకు మంగళగిరిలో బయల్దేరి నవులూరు, కృష్ణాయపాలెం, యర్రబాలెం, తుళ్లూరు మండలంలోని శాఖమూరు, దొండపాడు, అనంతవరం, యర్రబాలెం, ఐనవోలు, రాయపూడి గ్రామాల్లో పవన్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా రైతులు, రైతు కూలీలతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు.

Pawan Kalyan
Janasena
Amaravathi
Farmers
  • Loading...

More Telugu News