Sudhakar: నన్ను ఒరేయ్ అనడానికి పవన్ చాలా ఇబ్బంది పడ్డాడు: కమెడియన్ సుధాకర్

  • చిరంజీవి నాకు మంచి స్నేహితుడు
  • ఇద్దరం కలిసి నటించాం  
  • పవన్ మా ఇంటికి వస్తుంటాడు 

తెలుగు తెరపై తనదైన ముద్రవేసిన కమెడియన్స్ లో సుధాకర్ ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,"చిరంజీవి .. నేను మంచి స్నేహితులం. 'వరప్రసాద్'గా వున్నప్పుడు కూడా ఆయనని నేను చిరంజీవి అనే పిలిచేవాడిని. ఆ తరువాత అదే ఆయన పేరు కావడం విశేషం. ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాం.

ఇక పవన్ కల్యాణ్ తోను నాకు మంచి స్నేహం వుంది. పవన్ చెన్నై వచ్చినప్పుడల్లా మా ఇంటికి తప్పకుండా వస్తాడు. 'సుస్వాగతం' సినిమాలో పవన్ నన్ను 'ఒరేయ్' అని పిలవాల్సి వచ్చింది. అలా నన్ను పిలవడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. 'గోకులంలో సీత' సినిమా షూటింగులోను ఇదే పరిస్థితి ఎదురైంది. 'ఫరవాలేదు .. నువ్వు పిలిచేది నన్ను కాదు .. నా పాత్రను' అని నేను రిక్వెస్ట్ చేయవలసి వచ్చింది. ఇప్పటికీ మా మధ్య ఆ స్నేహం వుంది" అని ఆయన చెప్పుకొచ్చాడు.

Sudhakar
Chiranjeevi
Pavan
  • Loading...

More Telugu News